GHMC: నగరంలో పలుచోట్ల భారీ వర్షం.. జీహెచ్ఎంసీ అధికారుల కీలక ప్రకటన

by Shiva |
GHMC: నగరంలో పలుచోట్ల భారీ వర్షం.. జీహెచ్ఎంసీ అధికారుల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో మంగళవారం సాయత్రం మరోసారి కుండపోత వర్షం పడింది. దీంతో ప్రధాన రహదారులన్ని చెరువులను తలపిస్తున్నాయి. ఐకియా సర్కిల్ నుంచి కిలో మీటరు మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్ హైటెక్ సిటీ, బంజారా‌ హిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అదేవిధంగా పంజాగుట్ట, బేగంపేట, అమీర్‌పేట్, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్‌పేట్‌, పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణ‌గూడ, అబిడ్స్, లక్డీకాపూల్, కోఠి, నాంపల్లి, అఫ్జల్ గంజ్, బేగంబజార్, చార్మినార్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ‌తో పాటు డీఆర్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే అధికారులు కీలక ప్రకటన చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మ్యాన్‌హోల్స్ తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. గమనించి రాకపోకలు సాగించాలని తెలిపారు. ఇక పూడుకుపోయిన నాలాను పునరుద్ధరించే పనిలో డీఆర్ఎఫ్ సిబ్బంది నిమగ్నమయ్యారు. అవసరం అయితేనే తప్పా.. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed