GHMC: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రగడ.. రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం

by Shiva |
GHMC: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రగడ.. రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ (GHMC) కౌన్సిల్ సమావేశం రసాభాసాగా మారింది. సభలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) సభ్యల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశం కొనసాగుతోండగానే ప్రశ్నోత్తరాల కోసం బీఆర్ఎస్ (BRS) సభ్యులంతా లేచి నిలబడి నిరసన తెలిపారు. అదేవిధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Meyor Gadwal Vijaya Lakshmi)కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు (BRS Corporators) పోడియం ఎదుటకు వెళ్లి ఆందోళన చేశారు. బడ్జెట్ సమావేశానికి సంబంధించి పేపర్లను విపక్ష సభ్యులు చించేశారున. బడ్జెట్ ఆమోదం తరువాతే ఆమె ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆగ్రహించిన బీఆర్ఎస్ (BRS) నేతలు పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభకు ఊరికే అడ్డుపడుతుండటంతో మార్షల్స్‌తో బీఆర్ఎస్ సభ్యులను బయటకు పంపేశారు. దీంతో జీహెచ్ఎంసీ (GHMC) కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మెరపు ధర్నాకు దిగింది.

కాగా, అంతకు ముందు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను సభలో మేయర్ గద్వాల విజయలక్ష్మి (Meyor Gadwal Vijaya Lakshmi) ప్రవేశపెట్టారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Former PM Manmohan Singh), పారిశ్రామిక వేత్త రతన్ టాటా (Rattan Tata)కు కౌన్సిల్ నివాళులర్పించింది. సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు (BRS Corporators) ప్లకార్డులతో నిరసన తెలిపారు. వారికి కాంగ్రెస్ సభ్యులు అడ్డుకుని ప్లకార్డులను చించేశారు. అలా జరుగుతుండగానే 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు (BJP Corporators) జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. గోషామహల్ స్టేడియాన్ని (Ghoshamahal Stadium) కూల్చొద్దని.. అక్కడి ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital)ను నిర్మించొద్దని నినాదాలు చేశారు. బడ్జెట్ సమావేశం దృష్ట్యా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ (GHMC Head Office) వద్ద భారీగా పోలీసులను మోహరించారు.


Next Story