- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. రేపు ఆ సినిమా ఉచిత ప్రదర్శన
దిశ, వెబ్‌డెస్క్: సినిమా లవర్స్‌కు భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ శుభవార్త చెప్పారు. రేపు జిల్లాలోని వలిగొండ మండలం వెంకటేశ్వ థియేటర్‌లో ‘రజాకార్’ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. మార్నింగ్‌తో పాటు మాట్నీ షోలో ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు ప్రకటించారు. మరుగున పడ్డ తెలంగాణ చరిత్రను రజాకార్ సినిమా ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. కాగా, తెలంగాణ ప్రాంతంలో నిజాం కాలంనాటి పరిస్థితులను, రజాకర్ల అకృత్యాలను చూపించిన ఈ సినిమా మొదటి నుంచి వివాదాలు ఎదుర్కొంది. బీజేపీ నేత అయిన ఈ చిత్ర నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్స్ సైతం వచ్చాయి. ఇప్పటివరకు దాదాపు 1100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయన కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు కేంద్ర హోం శాఖ ఆయనకు 1+1 సీఆర్పీఎఫ్ జవాన్‌లతో సెక్యూరిటీని నియమించింది. ఈ చిత్రానికి యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నటి ఇంద్రజ, యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటించారు.