Drug Test Positive: హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్.. మెరుపుదాడులతో బట్టబయలు

by Prasad Jukanti |
Drug Test Positive: హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్.. మెరుపుదాడులతో బట్టబయలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారనే అనుమానంతో ఎక్సైజ్ అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పబ్బుల్లో గత రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ రెయిడ్‌లో భాగంగా 33 మందికి డ్రగ్ డిటెక్షన్ టెస్టింగ్ నిర్వహించగా అందులో నలుగురికి పాజిటివ్ అని తేలింది. శేరిలింగంపల్లిలోని ఎం/ఎస్ క్వోరమ్ క్లబ్‌లో ఇద్దరికి, జూబ్లీహిల్స్‌లోని ఎం/ఎస్ బేబీలోన్‌లో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. కాగా, డ్రగ్స్‌ను అరికట్టేందుకు అధికారులు ఇటీవల తరచూ పబ్‌లలో తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story