- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భద్రాద్రి కొత్తగూడెంలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కీలక వ్యాఖ్యలు
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి సమావేశానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఉదయం మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న క్రమంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కార్యాయలం దగ్గర భారీ కడ్లు ఏర్పాటు చేశారు. అయినా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింగ్ నాయక్, మాజీ వైఫ్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్‌లు భారికేడ్లు దాటి మున్సిపల్ ఆవరణలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపుచేశారు.
Next Story