- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గాంధీ భవన్‌కు మాజీ పీసీసీ డీఎస్.. కాంగ్రెస్‌లో చేరిక..
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్, డీఎస్‌ల ద్వయంగా పేరొందిన మాజీ పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ తన సొంత పార్టీలో చేరారు. ఆదివారం గాంధీ భవన్‌లో రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మపురి శ్రీనివాస్, ఆయన తనయుడు సంజయ్ లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటుపై గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష సమయంలోనే ధర్మపురి శ్రీనివాస్, ఆయన తనయుడు సంజయ్‌లు పార్టీలో చేరే కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని డీఎస్‌కు స్వాగతం పలికారు. తాను కాంగ్రెస్ పార్టీ సభ్యుడినేనని తనకు ప్రత్యేకంగా ఆహ్వానించాల్సిన అవసరం లేదని డీఎస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం మాజీ మేయర్ సంజయ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని ఖరారు అయిన డీఎస్ చేరికపై ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డీఎస్ తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని తనయుడి కోసమే కాంగ్రెస్ కార్యాలయానికి వస్తానని లేఖ విడుదల చేయడం కలకలం రేపింది. కానీ డీఎస్ స్వయంగా వీల్ చైర్ లో వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం తో ఆయన, ఆయన తనయుడు కాంగ్రెస్‌లో అధికారికంగా చేరినట్లయింది.
ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా రెండుసార్లు పని చేసిన ధర్మపురి శ్రీనివాస్ కు నిజామాబాద్‌లో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉండేవారు. మాజీ దివంగత మంత్రి అర్గుల్ రాజారాం శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన డీఎస్ ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడి గా కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పని చేశారు. ఆర్‌బిఐ ఉద్యోగిగా పని చేసిన డీఎస్ ఇందిరా గాంధీ పిలుపుమేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో భాగస్వాములయ్యారు. కోట్ల విజయభాస్కరెడ్డి, నేదురమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలోనూ మంత్రిగా పని చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను అసెంబ్లీలో ప్రస్తావించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్, డీఎస్ లు జోడెద్దులుగా పని చేశారని పార్టీలో పేరుంది. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్ మంత్రి గాను పని చేశారు. 2009 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉండగానే ఓటమి చెందడంతో తర్వాత కాలంలో ఎమ్మెల్సీ గా పని చేశారు.
శాసన మండలి ఫ్లోర్ లీడర్ గా పని చేసిన డీఎస్ తర్వాత కాలంలో తనకు ఎమ్మెల్సీ గా పొడగింపు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి దూరమై టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా, ఐదు సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. రాష్ట్రంలో నంబర్ 2 గా చలామణి అయిన డీఎస్ టీఆర్ఎస్ లో ఇమడలేక పోయారు. చిన్న కొడుకు అర్వింద్ బీజేపీలో చేరి ఎంపీగా కావడం వెనుక డీఎస్ క్రీయాశీలకం గా వ్యవహరించారనేది అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఎంపీగా పదవీకాలం ముగియడంతోనే అప్పటి నుంచి ఆయన పార్టీ మారుతారని చర్చ జరుగుతుంది.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ ధర్మపురి సంజయ్ తండ్రితో పాటు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తండ్రి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన సంజయ్ తనకు తానుగా సొంత ప్లాట్ ఫాం కోసం తండ్రి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గా ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లి అందరికి షాక్ ఇచ్చారు. 2021లో రేవంత్ రెడ్డికి పిసిసి పగ్గాలు అప్పగించగానే తాను పార్టీలో చేరుతానని సంకేతాలను ఇచ్చారు. కాని నిజామాబాద్ కు చెందిన ఒక్కరిద్దరి నేతలు అడ్డుపుల్లలు వేయడంతో సంజయ్ సొంత పార్టీలోకి మారడం ఆలస్యమైంది.ఈ నెలలో నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా సంజయ్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగిన డీఎస్ అనారోగ్యంతో పాటు, పార్టీ హైకమాండ్ నుంచి సంకేతాలు రాకపోవడంతో సంజయ్ కు ఎదురు చూపులు తప్పలేదు.
2004కు ముందు ధర్మపురి సంజయ్ తండ్రి చాటు తనయుడిగా శాంకారి విద్యా సంస్ధల పర్యవేక్షణ చేసేవారు. ధర్మపురి ఫౌండేషన్ ద్వారా సంజయ్ తన పుట్టిన రోజు వేడుకలకు బదులుగా చేసిన సేవా పేదింటి ఆడపిల్లలకు ఉచిత వివాహల నిర్వహణ) లాంటి కార్యక్రమాలు కోత్త ఒరవడికి నాంది పలికాయి. దానికి తోడు చాలా మందికి ఆపద సమయంలో ఆదుకున్న సేవలందించారు. డీఎస్ వారసుడిగా సంజయ్ ఎదుగుదల చాలమందికి గిట్టలేదు. నాడు డీఎస్ వెంట ఉన్నవారే సంజయ్ రాజకీయంగా రాణించడం ఇష్టం లేక అనేక వివాదాల్లోకి ఇరికించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో నడిచిన విద్యాసంస్థలను టార్గెట్ గా కొందరు చేసిన దుష్పచారం కూడా కొంత పని చేసింది కూడా ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే సంజయ్ సొంత పార్టీలో చేరడం పై కాంగ్రెస్ బలోపేతానికి అవకాశం ఏర్పడింది.
ఇప్పటిలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు గురించి ఎవరు అడుగకున్న రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నిలబడటానికి సంజయ్ రాక పునాధిగా మారనుంది. ఎందుకంటే డిఎస్ ఫ్యామిలీకి నిజామాబాద్ నియోజకవర్గం గుండెకాయ. డీఎస్, సంజయ్ కు ఇటు వారి కుల పరంగా మైనార్టీలో ఉన్న ఓటు బ్యాంకు పదిలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నిజామాబాద్ నియోజకవర్గం అర్బన్ నియోజకవర్గంగా పునర్వ్యవస్థీకరించి తర్వాత దాని ప్రతిష్ట మసకబారింది. వలస నేతలు బరిలో ఉండటంతో ప్రత్యర్థి పార్టీల కు దీటుగా నిలబడలేని క్యాండిడేట్ దొరకని పరిస్థితి నెలకొంది. డీఎస్, సంజయ్ ల ఘర్ వాపసితో పార్టీతో పాటు అర్బన్ లో రాజకీయ సమీకరణలు మారనున్నాయి అని చెప్పవచ్చు.