- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడిపోయి పదేళ్లైన తర్వాత ఇవేం మాటలు: సజ్జలపై మాజీ MP పొన్నం ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడి పదేండ్లు పూర్తవుతుందని, ఎక్కడి పాలన అక్కడే జరుగుతుందని, ఇలాంటి సమయంలో మళ్లీ తెలంగాణపై దాడి చేసే కుట్ర జరుగుతుందని కాంగ్రెస్పార్టీ సీనియర్నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్అన్నారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి విభజనపై ఆ కామెంట్స్ చేసి ఉంటారని, అన్ని పార్టీల అనుమతితోనే రాష‌్ట్ర విభజన జరిగిందన్నారు. ఆ రోజు అన్ని పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు తెలిపాయని ఆయన గుర్తు చేశారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాల విభజనపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆలోచన అవివేకమన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవాలే తప్ప మళ్లీ కలిపే ప్రయత్నం చేస్తే, వైసీపీ అందుకు అనుకూలంగా ఉందంటే మళ్లీ తెలంగాణ మీద రాజ్యాధికారం కొనసాగించాలనే ప్రయత్నం జరుగుతున్నట్లుగా ఉందన్నారు.
రెండు రాష్ట్రాలు కలుపుకోవాలనుకోవడం ఆమోదయోగ్యం కాదని, రాష్ట్రం విడిపోయి పదేళ్లయిన తర్వాత కూడా ఇవేం మాటలని పొన్నం మండి పడ్డారు. విభజన సమయంలోనూ ఏపీ నేతలు అలాగే వ్యవహరించారని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు వేర్వేరు రాష్ట్రాలని సజ్జల గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయని, సోదరభావంతో రెండు రాష్ట్రాలు అభివృద్ధి జరుగాలని, అంతేకానీ కలిసి ఉండాలని కోరుకోవడం పూర్తిగా అవివేకమన్నారు. రెండు రాష్ట్రాలను కలుపడం అనేది రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని, దీంతో మళ్లీ వివాదాలను రెచ్చగొట్టినట్లుగా మారుతుందని పొన్నం అన్నారు.
READ MORE
మళ్లీ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నారు.. సజ్జల కామెంట్స్‌పై భట్టి ఫైర్