- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకటి కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లలో BRS గెలిస్తే రేవంత్ రాజీనామా చేస్తారా?
దిశ, వెబ్‌డెస్క్: చేవెళ్ల వేదికగా బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వీకరించారు. మంగళవారం సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. ఒకటి కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని ఎదురు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రజలు అసలు విషయం అర్థం అయిందని తెలిపారు. కేసీఆర్‌ను ఎందుకు ఓడించామా? అని ప్రజల్లో బాధ మొదలైందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని అన్నారు. ఒకటి కాదని.. మెజార్టీ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతున్నారని అన్నారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజల్లో చర్చ కూడా మొదలైందని వెల్లడించారు. కాగా, అంతకుముందు చేవెళ్ల సభలో ‘‘నువ్వు మొనగాడివైతే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటైనా గెలిచి చూపించు. మీ అయ్య, నువ్వు, నీ కుటుంబం కలిసి ప్రయత్నించండి. మా కార్యకర్తలు నిటారుగా నిలబడి కొట్లాడుతారు. సీఎం, పీసీసీ చీఫ్హోదాలో పార్లమెంట్ ఎన్నికలకు వస్తున్నా.. బీఆర్ఎస్‌ను బండకేసి కొట్టుడే ఇక” మాజీ సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై బాల్క సుమన్ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.