Srinivas Goud: ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే తోలు తీస్తారా?

by Gantepaka Srikanth |
Srinivas Goud: ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే తోలు తీస్తారా?
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి దారుణంగా తయరైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హాస్టళ్లలో విద్యార్థులు పురుగుల అన్నం తినే పరిస్థితి రావడం దారుణమన్నారు. యూనివర్సిటీల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని గుర్తుచేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాల పాలు చేస్తోందని మండిపడ్డారు. పేద వర్గాల పట్ల చిన్న చూపు ప్రభుత్వ విధానమా? అని ప్రశ్నించారు. ఇది పేదల ప్రభుత్వమా లేక పెత్తందార్ల ప్రభుత్వమా? అని అడిగారు. అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే సాటి ఎమ్మెల్యేల తోలు తీస్తామంటున్నారు. ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? అని అన్నారు.

Advertisement

Next Story