Makar Sankranti: ఓల్డ్ సిటీలో రూ. కోటిన్నర కైట్ కలకలం

by srinivas |   ( Updated:2025-01-13 13:57:40.0  )
Makar Sankranti: ఓల్డ్ సిటీలో రూ. కోటిన్నర కైట్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: కోటిన్నర విలువైన పతంగి నింగిలోకి ఎగిరింది. మకర సంక్రాంతి (Makar Sankranti) సందర్భవంగా పతంగి(Kite)కి కోటి, వైట్ త్రెడ్‌ కోటింగ్‌తో గోల్డ్ మాంజాకు రూ.40 లక్షలు పెట్టి హైదరాబాద్(Hyderabad) పాతబస్తీకి చెందిన గోల్డ్‌మేన్ సూర్యాభాయ్(Goldman Suryabhai) ఎగురవేశారు. భోగి(Bhogi), కైట్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. ట్విన్ సిటీల్లో చిన్నా, పెద్దలు పంతగులు ఎగుర వేస్తూ సందడి చేస్తున్నారు.

మరో కైట్ నో పోటీ


అయితే పాతబస్తికి చెందిన సూర్యాభాయ్.. కోటిన్నర విలువైన పతంకి ఎగురవేశారు. ఈ పతంగితో పోటీ పడే మరో కైట్ లేదని ఆయన తెలిపారు. ఫస్ట్ టైమ్ అంత పెట్టి పతంగి తయారు చేయించినట్లు పేర్కొన్నారు. వెయ్యి పతంగులు వచ్చినా ఇలా తగిలి అలా పక్కకి వెళ్లిపోతాయని చెప్పారు. ప్రతి సంక్రాంతికి గోల్డ్ కైట్ ఎగురవేస్తానని, ఏపీ, తెలంగాణలో తనలా కోటిన్నర రూపాయల విలువైన పతంగి మరెవరు ఎగురవేయలేరని ఛాలెంజ్ విసిరారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన గోల్డ్ మెన్ సూర్య... ప్రచారం కోసమే బంగారం కైట్ ఎగురవేశామని తెలిపారు. అయితే దాని కోటిన్నర కాదని పేర్కొన్నారు.

Next Story