- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
R.Krishnaiah: బీసీ ఉద్యమం రాజకీయ నాయకుల్లో ఉండొద్దు.. ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయేది బీసీ రాజ్యమేనని, బీసీ లెక్చరర్లు, బీసీ మేధావులు బలమైన ఉద్యమాన్ని చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) అన్నారు. సోమవారం హైదరాబాద్ కాచిగూడలో తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రమోషన్లలో రిజర్వేషన్లు (BC Reservations) లేకపోవడం వల్ల బీసీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో బీసీ ఉద్యమం బలంగా ఉందని, ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం నడుస్తున్నదన్నారు. బీసీ ఉద్యమం (BC Movement) రాజకీయ నాయుకుల్లో ఉండొద్దని ఈ ఉద్యమాన్ని బీసీ మేధావులు ముందుకు నడిపించాలన్నారు. బీసీ మేధాలు మరింత బలంగా ఉద్యమాన్ని చేపడితే పాలకులు దిగివచ్చి సమస్యను పరిష్కరిస్తారన్నారు.