- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముస్లిం రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదు: షబ్బీర్ అలీ
దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘దేశంలో అంబేద్కర్రాజ్యంగం నడుస్తుందా..? బీజేపీ రాజ్యాంగం నడుస్తుందా? ముస్లింలపై వివక్ష తగదు. హోంమంత్రిగా అమిత్షా అన్ఫిట్” అంటూ మాజీ మంత్రి షబ్బీర్అలీ పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామనడం బీజేపీ ఆహంకారానికి నిదర్శనమన్నారు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీం కోర్టు పేర్కొన్నా.. బీజేపీ ముస్లింలపై కక్ష్యపూరిత చర్యలు చేపడుతుందన్నారు. కాంగ్రెస్హయంలో ప్రభుత్వం వెనకబడిన ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. పేద ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లు తొలగిస్తామంటే ఎలా? అంటూ ప్రశ్నించారు. మత పరంగా ముస్లింలను శత్రువులుగా చూడటం సరికాదన్నారు. హోంమంత్రి రాజ్యంగ విరుద్ధంగా ఎలా? మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముస్లిం రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదని నొక్కి చెప్పారు. అమిత్ షా పై రాజ్యాంగ పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. అమిత్ షా వాఖ్యల పై సుప్రీంకోర్టు లో పిటీషన్ వేస్తామన్నారు. అమిత్షా ఓ వర్గానికి హోంమంత్రి కాదని, దేశానికి అనే విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న అని చెప్పుకునే ఈటలకు ఇన్ని కోట్లు ఎలా? వచ్చాయంటూ ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల జరిగిన 6 నెలల తర్వాత ఈటల ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏమిటనీ మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్‌లోకి వస్తా? అని ఈటల తలుపులు తట్టాడని, కానీ కేసులు కాపాడుకునేందుకు బీజేపీలోకి వెళ్లాడని షబ్బీర్అలీ స్పష్టం చేశారు.