- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: ఇలా మీ కుటుంబంలో జరిగితే.. రాహుల్ జీ? ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ ఇదే
దిశ,డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఇటీవల ఫుట్‌పాత్‌పై షాపులను అధికారులు తొలగించారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారని షాపులు నడిపేవారు ఫైర్ అయ్యారు. ఒక పక్క కూల్చివేతలు జరుగుతున్న సమయంలో బయటకు వెళ్లకుండా కొంత మంది మహిళలు మాత్రం షాపుల్లోనే ఉండి అసహనం వ్యక్తం చేశారు. అయిన కూడా కూల్చివేతలు మాత్రం ఆపలేదు. ఈ కూల్చివేతలపై శనివారం ఎక్స్ వేదికగా (KTR) కేటీఆర్ స్పదిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ని ప్రశ్శించారు.
ఇలాంటి ఘటనలు మీ కుటుంబంలో జరిగితే, అంగీకరించగలరా? రాహుల్ గాంధీ జీ అని కేటీఆర్ ప్రశ్నించారు. పట్టింపు, మానవత్వం లేని ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడుతాయన్నారు. తెలంగాణలో ఇంట్లో ఇద్దరు మహిళలు ఉండగానే.. బుల్డోజర్లతో ఆ ఇండ్లను కూలగొట్టారని, మరి వారి భౌతిక భద్రతకు ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పేదలకు ప్రేమ పంచుతాం అనడం అంటే ఇదేనేమో అని రాహుల్ గాంధీకి కేటీఆర్ ట్యాగ్ చేశారు.