- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ మూడు MP సీట్లు గెలవడం కాంగ్రెస్ పార్టీకి అసాధ్యం.. తేల్చిచెప్పిన కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లారని విమర్శించారు. అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరని అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. లోక సభ ఎన్నికల కార్యచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఎంపీ అభ్యర్థి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో తీవ్రమైన అయోమయంలో ఉందని అన్నారు. చేవేళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అసాధ్యమని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేవేళ్లలో ఏప్రిల్ 13న భారీ బహిరంగా సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చేవేళ్ల సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని చెప్పారు.