Harish Rao : ఎక్స్‌లో సుమతీ శతకం పద్యం చెప్పి మాజీ మంత్రి తీవ్ర విమర్శలు

by Ramesh N |   ( Updated:2024-11-08 15:41:11.0  )
Harish Rao : ఎక్స్‌లో సుమతీ శతకం పద్యం చెప్పి మాజీ మంత్రి తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శుక్రవారం సుమతీ శతకం పద్యం రాసుకొచ్చారు. ‘కనకపు సింహాసనమున, శునకము కూర్చుండ బెట్టి శుభలగ్నమునం, దొనరగ బట్టము కట్టిన, వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!’ అని వెల్లడించారు. ఇది ప్రస్తుత ముఖ్యమంత్రికి సరిగ్గా సరిపోతుందని విమర్శించారు. కేసీఆర్ (KCR) కాలి గోటికి కూడా సరిపోని నువ్వు, సీఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావని పేర్కొన్నారు. తప్పు మీద తప్పు చేసి వదరబోతులా ప్రవర్తిస్తున్న (CM Revanth Reddy) రేవంత్ తీరును ప్రజలందరు గమనిస్తున్నారని తెలిపారు. నీ పుట్టిన రోజున తండ్రి వయసున్న కేసీఆర్ మీద, (Telangana) తెలంగాణ కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి మీద, నువ్వు చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని ఫైర్ అయ్యారు. నీ లాగా వికృతంగా మాట్లాడే ముఖ్యమంత్రిని ఈ దేశం ఎప్పుడూ చూసి ఉండదని, మూసీ నీళ్ళ మురికితో కడిగినా నీ నోరు మురికి పోదని, నీ వంకర బుద్ధి ఇగ మారదని విమర్శించారు.

నీ లాగా చిల్లరగా మేము మాట్లాడలేము. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని, అభివృద్ధి పథంలో నడిపిన గంభీరమైన చరిత్ర మాదని అన్నారు. బ్యాగులు మోసి, బ్యాగులు పంచి అడ్డ తోవన అధికారంలోకి వచ్చిన నీచ చరిత్ర నీదని వెల్లడించారు. నీ దోపిడిని, నీ దొంగబుద్ధిని నిరూపించి ప్రజా క్షేత్రంలోనే నీకు బుద్ధి చెబుతామన్నారు. పిచ్చి ప్రగల్భాలు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని, నిరంకుశత్వం మాని నిర్మాణాత్మక నిర్ణయాలపై శ్రద్ధ వహించాలని సూచించారు.


Read More..

Harishrao Challenge: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్.. దమ్ముంటే ఇక్కడ చెయ్

Advertisement

Next Story

Most Viewed