- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేసీఆర్ హయాంలో మతసామరస్యం వెల్లివిరిసింది’
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ వింధులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. కేసీఆర్ హయాంలో మత సామరస్యం వెల్లివిరిసిందన్నారు. కేసీఆర్ హయాంలో రంజాన్ సందర్భంగా తోఫా ఇచ్చేవారు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తోఫా బంద్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలు నీటి మూటలని తేలిపోయిందన్నారు. పార్టీ ఫిరాయింపు దారులను పక్కన పెట్టుకుని కాంగ్రెస్ నీతులు చెబుతుందని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆగం చేశారని ఆరోపించారు. పదేండ్లు కష్టపడి కేసీఆర్ వ్యవసాయాన్ని నిలబెడితే మూడు నెలల్లోనే వ్యవసాయాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ వస్తున్నారని ప్రాజెక్టులకు నీళ్లు వదిలారు. కుర్చీని కాపాడుకునేందకు కాంగ్రెస్ మంత్రులు కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు.