TSPSC బోర్డు ఏర్పాటు.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం

by GSrikanth |   ( Updated:2024-01-25 13:30:57.0  )
TSPSC బోర్డు ఏర్పాటు.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్‌సీ బోర్డు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు గురువారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమించారు. సభ్యులుగా ఐదుగురిని ఎంపిక చేశారు. అనితా రాజేంద్రన్, అమీరుల్లా ఖాన్, ప్రొఫెసర్ నర్రి యాదయ్య, రామ్మోహన్ రావు, పాల్వాయి రజినీకుమారిని సభ్యులుగా నియమించారు.

కాగా, TSPSC ఛైర్మెన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఎంపిక చేస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గురువారం ఆమోదముద్ర వేశారు. దీంతో ఆయన టీఎస్పీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఛైర్మన్‌గా ఘంటా చక్రపాణి పని చేశారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి జనార్థన్ రెడ్డి పని చేశారు. ఇటీవలే జనార్థన్ రెడ్డితో పాటు పలువురు సభ్యులు రాజీనామా చేశారు. దీంతో గత ప్రభుత్వం చేసిన తప్పులను రిపీట్ కాకుండా చూసేందుకు మాజీ డీజీపీకి ప్రభుత్వం ఆ బాధ్యతలు అప్పగించింది.

Advertisement

Next Story

Most Viewed