- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TPCC చీఫ్‌తో గద్దర్ భేటీ.. తానే బాధ్యత తీసుకుంటానని రేవంత్ హామీ

X
దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ప్రజాగాయకుడు గద్దర్ మంగళవారం గాంధీభవన్‌లో భేటీ అయ్యారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేలా ఢిల్లీ పెద్దలకు సూచించాలని రేవంత్‌రెడ్డికి వినతిని అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక బృహత్తర బాధ్యతను ప్రజా గాయకుడు గద్దర్ తనకు అప్పగించాలని, వారి వినతిని చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఆ నివేదికను తీసుకుని తానే బాధ్యత తీసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని వివరించారు. ఆ తీర్మాణాన్ని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి అందజేస్తామని వెల్లడించారు. పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చ జరిపి నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Next Story