- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్యే రసమయికి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు..
దిశ, గన్నేరువరం: రాజీవ్ రహదారి గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం ఎప్పుడు చేపడతారని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. రూ.71 కోట్ల నిధుల మంజూరు జీవో ఉట్టిదేనా అని ప్రశ్నిస్తూ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పలు గ్రామాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బిజెపి మండల శాఖ డబుల్ రోడ్డు సాధనకై పాదయాత్ర నిర్వహిస్తే ప్రభుత్వం దిగివచ్చి రూ. 71 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిందని, ఆ రోడ్డు పనులు మాత్రం ఏ మాత్రం ప్రారంభం కాలేదని, గునుకుల కొండాపూర్, గుండ్లపల్లి గ్రామాల ప్రజలు దుమ్ముతో సతమతమవుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే రసమయి పనితీరు ఇదేనా అని, మండల ప్రజల ప్రయాణ కష్టాలు తీరేది ఎన్నడని ప్రశ్నిస్తూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలను పలువురు గ్రామస్తులు పరిశీలిస్తూ జరగని అభివృద్ధి గురించి వినూత్న నిరసన తెలిపిన బిజెపి మండల శాఖను అభినందిస్తున్నారు.