- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Fire Accident: ఓఆర్ఆర్ పై ప్రమాదం.. కారులో మంటలు చెలరేగి ఇద్దరికి తీవ్ర గాయాలు
by Ramesh Goud |

X
దిశ, వెబ్ డెస్క్: ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road)పై ప్రమాదం(Accident) చోటు చేసుకుంది. రన్నింగ్ లో ఉన్న కారు(Running Car)లో మంటలు చెలరేగి ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. శంషాబాద్(Shamshabad) సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారు ఇంజిన్(Car Engine) లో నుంచి అకస్మాత్తుగా మంటలు(Fire) చెలరేగాయి. రన్నింగ్ ఉండగా మంటలు రావడంతో కొద్ది క్షణాల్లోనే మంటలు కారు లోపలికి వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును ఓఆర్ఆర్ పై పక్కకు తీసుకెళ్లి నిలిపాడు. కారులో డ్రైవర్ తో పాటు ఉన్న మరో వ్యక్తికి మంటలు అంటుకొని తీవ్ర గాయాల పాలయ్యారు. దీనిపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని పోలీసులు వెల్లడించారు.
Next Story