- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుది ఎంపిక స్క్రీనింగ్ కమిటీ సమావేశం స్టార్ట్..! 100 సెగ్మెంట్లకు సింగల్ నేమ్..?
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది ఎంపిక స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలో మురళీధర్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిలు హాజరయ్యారు. ఈ సమావేశంలో 119 సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసే ప్రాసెస్ జరుగుతున్నది. ఇప్పటికే ఫైనల్ చేసిన 72 లిస్టుతో పాటు మరికొన్ని సెగ్మెంట్లకు క్యాండిడేట్లను ఫిల్టర్ చేయనున్నారు.
దాదాపు 100 సెగ్మెంట్లకు ఈరోజు సింగల్‌నేమ్‌తో జాబితా తయారు చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే 70 స్థానాలకు పైగా ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నది. ఇక స్క్రీనింగ్ కమిటీలో తయారుచేసిన లిస్టును ఈరోజు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదముద్ర వేయనున్నది. అనంతరం ఏఐసీసీకి, రాష్ట్ర పార్టీకి లిస్టు పంపించనున్నారు. ఏఐసీసీ టీపీసీసీ సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. మరోవైపు స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతల చుట్టూ టికెట్ల కోసం తిరుగుతున్నారు.