- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Encounter: నాడు తప్పించుకున్న మావోయిస్టులు.. నేడు దెబ్బకొట్టిన పోలీసులు..!
దిశ, వరంగల్ బ్యూరో: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక వద్ద జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఇల్లందు- నర్సంపేట ఏరియా కమిటీ దళంగా పోలీసులు గుర్తించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో ఇల్లందు - నర్సంపేట ఏరియా పార్టీ కార్యదర్శి, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ కుర్సం మంగు అలియాస్ భద్రు(35) అలియాస్ పాపన్న, ఏటూరునాగారం మహదేవ్‌పూర్ ఏరియా కమాండర్ ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు(43)తో పాటు దళ నాయకులు ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్(22), దళ సభ్యురాలు ముస్సాకి జమున(23), జైసింగ్(24), కిషోర్(22), కామేష్(23) ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున పోలీస్ కూంబింగ్ దళాలకు చెల్పాక వద్ద ఎదురుపడటంతో ఎదురు కాల్పులు మొదలయ్యాయి. కాల్పుల అనంతరం పోలీసులు ఘటనా స్థలంలో ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. రెండు AK-47 రైఫిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దళ కమాండర్ బద్రుతో పాటు మరో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. బద్రుపై రూ.20 లక్షల రివార్డు ఉంది. గుత్తికోయ సామాజిక వర్గానికి చెందిన బద్రు స్వస్థలం ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా చెరమంగి. ఏగోళపు మల్లయ్య అలియాస్ మధుది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామం. ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్ స్వస్థలం బీజాపూర్ జిల్లా ఉసూర్ గ్రామం. అలాగే మిగతా నలుగురు మావోయిస్టు సభ్యులైన ముస్సాకి జమున, జైసింగ్, కిషోర్, కామేష్‌లు కూడా ఛత్తీస్‌గడ్‌కు చెందినవారే కావడం గమనార్హం.
అంతా యువరక్తమే..!
మృతి చెందిన ఏడుగురు మావోయిస్టులలో 24 ఏళ్లలోపు ఉన్న వాళ్లు ఐదుగురు ఉండటం గమనార్హం. దశాబ్దన్నర కాలం తర్వాత ములుగు జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ ఇదే. పోలీసు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే నెపంతో గత నెల 21 అర్ధరాత్రి సమయంలో ములుగు జిల్లా వాజేడులో పెనుగోలు కాలనీలో పేరూరు పంచాయతీ కార్యదర్శి ఉయికా రమేశ్, ఆయన సోదరుడు ఉయికా అర్జున్‌ను మావోయిస్టులు హతమార్చారు. వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట మావోయిస్టులు రెండు లేఖలను మృతదేహాల వద్ద వదిలి వెళ్లారు. ఈ ఘటన ములుగు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఏటూరునాగారంలో ఆదివాసీలు మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ సైతం నిర్వహించారు. శనివారం ఏటూరునాగారం, వెంకటపూర్, వాజేడుల్లోనూ మావోయిస్టులకు వ్యతిరేకంగా బ్యానర్లు వెలిశాయి.
బద్రు కోసం ఏళ్లుగా అన్వేషణ.. పక్కా సమాచారంతో అటాక్
ములుగు జిల్లా ఏటూరునాగారం, వాజేడు, నూగూరు వెంకటాపురం అడవుల్లో మావోయిస్టు దళాలు సంచరిస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం చేరింది. ఈ నేపథ్యంలో పెనుగోలు ఘటన తర్వాత కూంబింగ్‌ను తీవ్రతరం చేశారు. స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు అడవిని జల్లెడపడుతున్నాయి. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల యాక్షన్‌టీం కమాండర్‌గానూ పనిచేసిన బద్రు 2022లో 20 రోజులు తాడ్వాయి అరణ్యంలో సంచరిస్తున్నట్టు నిఘావర్గాలు నాడు పసిగట్టాయి. ఆ సమాచారంతో స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు అడవిని జల్లెడపట్టాయి. వీరాపూర్ అటవీ ప్రాంతంలో దళాలు సేదతీరుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకునేందుకు యత్నిస్తుండగా సెంట్రీ టీం అప్రమత్తమైంది. మావోయిస్టులు డెన్‌ను ఖాళీ చేసే క్రమంలో నిత్యావసరాలు, సామగ్రిని వదిలేసి వెళ్లారు. అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అతి సమీపంలోకి రావడంతో కాల్పులు ప్రారంభించారు. పోలీసులు కూడా ఫైరింగ్‌కు దిగారు. సుమారు 15 నిమిషాలపాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసులకు చిక్కకుండా బద్రు టీం తప్పించుకుంది. అయితే ఈ సారి మాత్రం పోలీసులు పక్కా సమాచారం, వ్యూహంతో మావోయిస్టులపై తుపాకీ తూటాలతో దాడి చేశారు.