రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి చలనం లేదు: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

by Shiva |
రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి చలనం లేదు: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు‌బంధు డబ్బులు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని రైతులు ఎదురు చూస్తున్నారని అన్నారు. రైతు బంధు విషయంలో ప్రభుత్వానికి ఓ విధానం లేదని అరోపించారు. నీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. రైతు రుణ మాఫీ ఎవరెవరికి ఇస్తారన్నది క్లారిటీ లేదని ఆరోపించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేయాలనే దుర్మార్గపు ఆలోచన ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. సీఎం నియోజకవర్గం కొడంగల్‌లోనే నకిలీ విత్తనాలు పట్టుకున్నారని, వాటిని నివారించడంలో ఘోరంగా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టే చర్యలు ఎక్కడా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మన్నె గోవర్ధన్‌రెడ్డి, రూప్ సింగ్ పాల్గొన్నారు.



Next Story