- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జనసేనతో పొత్తు వల్లే తెలంగాణలో బీజేపీ ఓటమి.. కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే!

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. పోటీ చేసిన అగ్రనేతలంతా ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. అంతేకాదు.. పోటీ చేసిన 8 స్థానాల్లోనూ జనసేన ఓటమిపాలైంది. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ ఓడిపోవడానికి జనసేనతో పొత్తే కారణమని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపణలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు విస్తృతమయ్యాయి.
జనసేనతో పొత్తు లేకుంటే హైదరాబాద్‌లో మరిన్ని సీట్లు వచ్చేవని కిషన్ రెడ్డి అభిప్రాయపడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా.. ఈ ప్రచారంపై కిషన్ రెడ్డి స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీల మధ్య పొత్తు అనేది ఒకరిద్దరు తీసుకున్న నిర్ణయం కాదని... ఇరు పార్టీలు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దని... ఉద్దేశ పూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.