- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నారులపై నకిలీ డాక్టర్ వైద్య ప్రయోగాలు.. కలెక్టర్ సార్ చర్యలేవి ..?
దిశ, ఖమ్మం సిటీ: Khammam నియోజక వర్గంలో సాక్షాత్తు జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రైవేటు ఆసుపత్రి ఏర్పాటు చేసుకొని నకిలీ డాక్టర్‌తో పసి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులని చెప్పుకునే అధికార పార్టీ కేవలం మాటలకే పరిమితమని మరోసారి రుజువైంది. అర్హత లేని డాక్టర్‌ని నియమించుకొని అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని పసి బిడ్డల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పదే పదే తమ ప్రసంగాల్లో చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తున్నామని చిన్నారులను కాపాడటంలో తమ ప్రభుత్వమే ముందుంటుందని చెబుతుంది. కానీ క్షేత్ర స్థాయిలో చిన్నారుల ఆయుష్షుతో ఆటలాడుతున్న కేడి డాక్టర్లపై చర్యలు తీసుకోవడంలో విఫలం చెందుతుంది. ఎక్కడో బీజేపీ పాలన రాష్ట్రాల్లో చిన్నారులకు ఆక్సిజన్ అందలేదని ఆందోళన చేసిన బీఆర్ఎస్ పార్టీ తమ రాష్ట్రంలో నకిలీ డాక్టర్లు కనపడటం లేదా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఫార్మసిస్ట్‌గా ఉన్న వ్యక్తి డాక్టర్ అవతారం అభం శుభం తెలియని పసిగుడ్డులపై వైద్య ప్రయోగాలు చేస్తుంటే జిల్లా వైద్యాధికారి కనీసం విచారణ జరపలేదు.
విచారణ జరపకపోవడం వెనుక సూపరింటెండెంట్ మరియు జిల్లా వైద్యాధికారిది ఒకే సామాజిక వర్గం కావునా చర్యలు లేవనే చర్చ జరుగుతుంది. అన్యాయాన్ని తప్పును సహించని కలెక్టర్‌గా పేరున్న గౌతమ్ మౌనం వెనుక ఉన్న పెద్ద గొంతు ఎవరిది అనేది అంతు చిక్కడం లేదు. జిల్లా కలెక్టర్‌ని మ్యానేజ్ చేసే స్థాయికి సూపరిటెండెంట్ చేరాడా లేకా ఫార్మసిస్ట్ చేరాడా అనేది తెలియాల్సి వుంది. జిల్లా కేంద్రంలో మంత్రి నియోజక వర్గంలో ఇంత పెద్ద ఉదంతం వెలుగులోకి వచ్చిన పట్టించుకోక పోవడం వెనుక ఉన్న ఒత్తిడి ఎంటని ప్రజలు చర్చించుకుంటున్నారు.
పదే పదే వైద్యులను హెచ్చరించే మంత్రి హరీశ్ రావు ఈ నకిలి డాక్టర్ విషయంలో జోక్యం చేసుకొని, కఠినంగా శిక్షించి తెలంగాణలో తప్పు చేసే డాక్టర్లుకు గుణపాఠం నేర్పాలని ప్రజలు కోరుతున్నారు. చీటికి మాటికి ఉలిక్కిపడి రోడ్డెక్కే ప్రజా సంఘాలు , ప్రతి పక్షాలు నకిలి డాక్టర్ విషయంలో ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ విషయంలో మౌనం వహించడం వెనుక కారణాలు లేకపోలేదనే చర్చ జరుగుతుంది. అన్యాయాన్ని, తప్పును ప్రశ్నించక పోవడం కూడా సమర్ధించడం వంటిదే అనే అంశాన్ని విస్మరిస్తే భవిష్యత్తు తరాల ముందు జవాబుదారిగా నిలబడాల్సి వస్తుందనే విషయాన్ని మరవద్దు.