వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకు వెళ్లాలి.. సీపీఎం నేత జాన్ వెస్లీ

by Ramesh Goud |
వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకు వెళ్లాలి.. సీపీఎం నేత జాన్ వెస్లీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: భావజాల రంగంలో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ప్రజలకు వివరించేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు జి. రాములు అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగం సంస్థలన్నింటిని కట్టబెట్టేందుకు పూనుకుంటుందన్నారు. కార్పొరేట్ దోపీడీ ప్రజలకు అర్థం కాకుండా ఉండేందుకు భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చీలికలు తీసుకొస్తుందని జాన్ వెస్లీ అన్నారు. వాస్తవాలను, కార్పొరేట్ దోపిడీ ని ప్రజలకు అర్థమయ్యే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు.

అనంతరం సీనియర్ నాయకులు ఎం వి ఎస్ శర్మ మాట్లాడుతూ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజానీకంలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టి లౌకిక శక్తులను విశాల ప్రాతిపదికన సమీకరించాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా మండల స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవనోపాధిని కుంగదీస్తున్న ఆర్థిక సమస్యల మీద పోరాటం చేస్తూనే ప్రజలలో చీలికలు తీసుకొచ్చే విభజన ,విద్వేష విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టీ సాగర్, ఎండీ అబ్బాస్, ఎండీ జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed