- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశ గడువును ఇంటర్ బోర్డు అధికారులు మరోసారి పొడిగించారు. ఈనెల 31వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం కల్పించారు. గడువు పొడిగించడం ఇది రెండోసారి. షెడ్యూల్ ప్రకారం ఫస్టియర్ ప్రవేశాల గడువు ఆగస్టు 16తో ముగిసింది. అయితే ఇంకా చేరని వారికోసం గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. అయితే ప్రైవేటు కళాశాలల్లో చేరేవారు ఆలస్య రుసుం కింద రూ.750 చెల్లించాలని, ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల కాలేజీల్లో చేరేవారు మాత్రం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జూనియర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమయ్యాయి. అయితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్, మార్చి మొదటి వారం నుంచి థియరీ పరీక్షలను నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.