బీఆర్ఎస్ లో వెన్నుపోటు.. ఆ మనస్తాపం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
బీఆర్ఎస్ లో వెన్నుపోటు.. ఆ మనస్తాపం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నేతల వెన్నుపోటు రాజకీయాల వల్లే తాను ఓటమి పాలయ్యానని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఆయన ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..స్వార్థపరులే పార్టీని వీడుతున్నారన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలపై రియాక్ట్ అవుతూ.. నేనేంటో ప్రజలకు తెలుసని పార్టీని వీడినప్పుడు ఎదో ఒకటి అనాలి కాబట్టే ఎర్రబెల్లి దయాకర్ అలా విమర్శిస్తున్నారన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. ఎన్నికల్లో వెన్నుపోటు రాజకీయాలు తనను బాధపెట్టాయని ఆ మనస్థాపం నుంచి నేనింకా కోలుకోలేకపోతున్నానన్నారు. అయినా ఇప్పటి వరకు ఎవరిపై నేను ఆరోపణలు చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబెల్లి దయాకర్ పాత్ర దర్యాప్తులో అధికారులే తేల్చుతారన్నారు. తాను ప్రజల మనిషిగా ప్రజల్లో ఉంటే తనపై కుట్రలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి ఫలితాల్లో మార్పు, కాంగ్రెస్ అబద్దపు హామీలు, ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారని ఆరోపించారు. కేసీఆర్ తనకు పెద్దదిక్కులాంటి వారని అయితే గత పదేళ్లలో మోడీ హయాంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీలో చేరాన్నారు. ఎస్సీ వర్గీకరణ మోడీ నేతృత్వంలో జరుగుతుందని నమ్మకం ఉందన్నారు. వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో బీజేపీ హామీ ఇచ్చారు. అభ్యర్థిగా ప్రకటిస్తే విజయం తనదేనని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed