- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆదుకోండి సార్.. కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఆక్వారంగం(Aquarium) ఎప్పటి నుంచి నష్టాల్లో కొనసాగుతోంది. ఉత్పత్తి, దిగుబడి పర్వాలేదనిపించినా గిట్టుబాటు లేక ఆక్వా రైతులు(Aqua farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా పరిస్థితులు కొద్దికొద్దిగా మెరుగుపడుతున్నాయి. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రంలోని ఆక్వా రంగంపై తీవ్రంగా పడింది. దీంతో ఆక్వా రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. తమకు సాయం అందించాలని కోరుతున్నారు.
అయితే ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం వద్దకు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తీసుకెళ్లారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్(Union Minister Piyush Goyal)కు సీఎం లేఖ రాశారు. ‘‘అమెరికా సుంకాల కారణంగా ఆక్వా రంగం తీవ్రంగా నష్టపోతోంది. ఈ మేరకు అండగా నిలవాలి. అమెరికా సుంకాల(US tariffs) నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు ఇవ్వాలి. సంక్షోభ సమయంలో తద్వారా ఆక్వా రైతులను ఆదుకోవాలి.’’ అని లేఖలో చంద్రబాబు కోరారు.