ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు‌కు చుక్కెదురు

by Sathputhe Rajesh |   ( Updated:2024-03-21 05:45:40.0  )
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు‌కు చుక్కెదురు
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావుకు చుక్కెదురు అయింది. కస్టడీని సవాల్ చేస్తూ ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కస్టడీపై కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది. ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్ రావు కస్టడీ విషయంలో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదని కస్టడీ ముగిసిన వెంటనే జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని హై కోర్టులో ప్రణీత్ రావు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story