అంబేద్కరే వచ్చి అడిగినా అది జరగదు..ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు?

by Jakkula Mamatha |   ( Updated:2024-04-23 14:25:35.0  )
అంబేద్కరే వచ్చి అడిగినా అది జరగదు..ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే తాజాగా పీఎం నరేంద్ర మోడీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ పార్టీపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే..బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న అబద్ధాన్ని ఇంకా ఎన్ని రోజులు ప్రచారం చేస్తారని ప్రధాని మోడీ ప్రశ్నించారు. ఛత్తీస్‌ఘడ్‌లో జూంజ్ గిర్ -చంపాలో మంగళవారం (ఏప్రిల్ 23) జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ తిరిగి వచ్చి అడిగినా రాజ్యాంగాన్ని ఎవరూ మార్చ లేరన్నారు. కాంగ్రెస్ నేతలు తాము రాముని కంటే గొప్పవాళ్ళం అనుకుంటారని అందుకే అయోధ్య ప్రాణప్రతిష్టకు కూడా రాలేదని ఎద్దేవా చేశారు.


Read More...

నా 90 సెకన్ల ప్రసంగంతో ఇండియా కూటమిలో ప్రకంపనలు- ప్రధాని మోడీ

Advertisement

Next Story