‘అది మునిగిపోయే నావ’.. బీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
‘అది మునిగిపోయే నావ’.. బీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావ అని.. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ కష్టమని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీ సరైన వేదికని అన్నారు. మరోవైపు రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీపైన ఈటల విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు కానీ హమీలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు అంతా ఈజీ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed