- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజాసింగ్‌తో ఈటల భేటీ.. సస్పెన్షన్ ఎత్తివేతపై కీలక చర్చ..!
దిశ, తెలంగాణ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. రాజాసింగ్ సస్పెన్షన్ అంశంతో పాటు.. నాయకులు, కార్యకర్తలను బీఆర్ఎస్ సర్కార్ ఇబ్బందులు పెడుతున్న తీరుపై చర్చించారు. కాగా ఇటీవల గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై, కార్పొరేటర్‌పై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్న విషయాన్ని రాజాసింగ్ ఈటల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకులపై కక్షపురితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
గోషామహల్ నియోజకవర్గంలో ఎలా అయినా గెలవాలని తమ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. బీజేపీ నాయకులపై నమోదైన కేసులపై పోలీస్ అధికారులతో మాట్లాడుతానని ఈటల చెప్పారు. రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందన్నారు. సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఈటల వెల్లడించారు.