ఎర్రబెల్లిని శాశ్వత అనర్హుడిగా ప్రకటించాలి.. RSP సంచలన డిమాండ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-05 06:24:52.0  )
ఎర్రబెల్లిని శాశ్వత అనర్హుడిగా ప్రకటించాలి.. RSP సంచలన డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దళిత బంధు పథకం అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడినట్లు ఓ ఆడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీనిపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ దొంగలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఎన్నికల కోసం స్కీములు ప్రజల మీద వెదజల్లి, వాళ్లను నిరంతరం భయంలో పెట్టి ఓట్లు దండుకోవడం ఎట్లా చేస్తారో ఈ ఆడియోతో నిరుపితమైందన్నారు.

‘ఏకగ్రీవంగా బీఆర్ఎస్‌కు ఓట్లేస్తేనె పథకాలంట.. అట్లా కాదు అంటే పథకాలు ఇయ్యరంట, వాళ్లు లబ్ది దారుల లిస్ట్ రిలీజ్ చేస్తే మనం మనం కొట్టుకుచావాలంట, ఛీ.. ఛీ ఏం బతుకులుర బై మీవి? ఇంత పట్టపగలే కేసీఆర్-బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు?’ అని ఫైర్ అయ్యారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి మంత్రి దయాకర్ రావును ఎన్నికల్లో పాల్గొనడానికి శాశ్వతంగా అనర్హుడిని చేయాలని, లేకపోతే ఊరుకునేది లేదని వెల్లడించారు.

Advertisement

Next Story