ALERT : పింఛన్ దారులకు ఈపీఎఫ్‌వో కీలక సూచన

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-12 06:06:29.0  )
ALERT :  పింఛన్ దారులకు ఈపీఎఫ్‌వో కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: పింఛన్ దారులకు ఈపీఎఫ్ వో కీలక సూచన చేసింది. అధిక పింఛను కోసం ఉద్యోగుల పింఛన్ నిధికి (ఈపీఎస్) బకాయిలు చెల్లించేందుకు ఉద్యోగి పీఎఫ్ ఖాతాల్లోని నగదు బదిలీ చేసేందుకు పింఛన్ దారులు తమ సమ్మతి తెలియజేయడానికి డిమాండ్ నోటీసు జారీ చేసినప్పటి నుంచి మూడు నెలల సమయం ఇవ్వనున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. అధిక పింఛన్ కోసం ఉమ్మడి ఆప్షన్ల ఆమోదం, ఈపీఎస్‌లో జమచేయాల్సిన బకాయిలు వడ్డీతో లెక్కింపు, ఆ మొత్తం జమ చేసేందుకు మార్గదర్మకాలను ఈపీఎఫ్‌వో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ జారీ చేశారు.త్వరలో పింఛన్ లెక్కింపు విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. అధిక పింఛన్ అర్హులైన పెన్షన్ దారులు ఈపీఎస్ లో 9.49 శాతం జమచేయాలని కార్మిక శాఖ నోటిఫికేసన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Also Read.

యాదవ సంఘాల డెడ్‌లైన్.. రేవంత్ రెడ్డి సారీ చెప్తాడా?

Advertisement

Next Story