- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చనాక-కొరాట ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు
దిశ, డైనమిక్ బ్యూరో: గోదావరి నది జలాల వినియోగం విషయంలో కీలక ముందడుగు పడింది. చనాక-కొరాట బ్యారేజీకి పర్యవరణ అనుమతులు లభించాయి. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జలవనరుల శాఖకు అధికారికంగా సమాచారం పంపింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ, బేలా మండలాల్లోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2016లో తెలంగాణ ప్రభుత్వ మహారాష్ట్ర సర్కార్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఈ ప్రాజెక్టు పనులను చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా తీసుకోవాలని గతంలో కేంద్రం సూచించింది.
అనుమతులకు సంబంధించిన ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం గతంలోనే పూర్తి చేయగా మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన పోర్షన్ కు సంబంధించి పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడంతో ఇబ్బంది ఏర్పడింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో సంబంధం లేకుండా తాము చేపట్టిన పనులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలో తెలంగాణ వాదనతో ఏకీభవించిన ఈఏసీ చనాక కోరాట ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ గతంలోనే సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.