- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రభుత్వ ఉద్యోగికి రూ.లక్ష ఉపాధి హామీ చెక్కు

దిశ నల్లగొండ బ్యూరో: ఉపాధి హామీ పథకం ( EGS) పేదలకు ఏడాదిలో వంద రోజులు పని కల్పించేందుకు యూపీఏ(UPA) ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఇది. అయితే ఈ నిధులను ఖర్చు చేయడంలో భాగంగా కూలీలకు వారి వ్యక్తిగత ఖాతాలో పని చేసిన రోజుల సొమ్మును జమ చేస్తారు. మెటీరియల్ కాంపౌనెంట్ కోసం ఖర్చు చేసిన సొమ్మును గ్రామపంచాయతీ ఖాతా నుంచి దానికి సంబంధించిన వ్యక్తులకు అందజేస్తారు. కానీ ఓ మండలంలో పని చేశామనే పేరుతో అధికారులే ఉపాధి హామీ సొమ్మును బెల్లం పట్టిలాల పంపిణీ చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రామ పంచాయితీ నుంచే....!
చందంపేట మండలంలో ఏవెన్యూ ప్లాంటేషన్ (Avenue Plantation) మొక్కలకు నీరందించమనే పేరుతో అధికారులు ఉపాధి హామీ సొమ్మును స్వాహా చేసినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవంగా ఉపాధిహామీ బడ్జెట్ కూలీలు పనిచేస్తే నేరుగా వారి ఖాతాలో జమ చేస్తారు. లేదా ఇతర నిర్మాణాలతో కూడిన పనులు చేపడితే మెటీరియల్ కాంపౌండ్ కింద గ్రామపంచాయతీ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టం (PFMS) ద్వారా గ్రామపంచాయతీ కార్యవర్గం తీర్మానంతో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ జాయింట్ ఖాతా సంతకం చెక్కు ద్వారా అందజేయాలి. అయితే చెక్కును ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో ఇవ్వకూడదు.
ఓ ఉద్యోగి పేరుతో రూ.లక్ష చెక్...
చందంపేట మండలంలో ఏవెన్యూ ప్లాంటేషన్‌కు నీరందించామనే పేరుతో జరిగిన అవినీతిలో అందరికీ భాగస్వామి ఉన్నట్లు సమాచారం. భాగంగానే ఈజీఎస్ ఉద్యోగికి చందంపేట మండలం రేకుల గడ్డి గ్రామ పంచాయతీ నుంచి రూ. 1 లక్ష చెక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క అధికారికి లక్ష రూపాయలు ఇస్తే ఆ పైన మండల స్థాయిలో ఉండే సుమారు నలుగురు అధికారులు, గ్రామపంచాయతీ సెక్రటరీలకు ఎంత ప్రభుత్వ సొమ్మును చెల్లించారో గ్రహించవచ్చు. ఆ చెక్కు అందుకున్న వ్యక్తి నాలుగైదు గ్రామాలకు బాధ్యుడు. ఇతడే ఇలా తీసుకుంటే మండల స్థాయి అధికారులకు ఎంత అందుతుందో అర్థం చేసుకోవచ్చు.
రింగ్ మాస్టర్ ఆయనే....
చందంపేట మండలం ఈజీఎస్ పథకంలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగి ఈ అవినీతికి కర్త, కర్మ, పూర్తి రింగ్ మాస్టర్ అంతా ఆయనే. మండలంలో జరిగే ప్రతి పనిలో ఆయన హస్తముంటుంది. ఈ అధికారి వచ్చిన తన కనుసనల్లోనే పనిచేసే విధంగా ప్రణాళికల రూపొందించి అమలు చేస్తారు. ఒకవేళ ఎవరైనా వినకపోతే తనకు రాజకీయ పలుకుబడి ఉందంటూ... భయం కల్పిస్తూనే ప్రలోభాలకు గురి చేస్తారని విమర్శలు ఉన్నాయి.
‘ఏం వార్తలు రాసుకుంటారో రాసుకోండి... నాకు రాజకీయ నాయకుల నుంచి అధికారుల దాకా అండదండలు ఉన్నాయి ....’ అంటూ బెదిరిస్తారని చర్చ కూడా సాగుతుంది.