Alleti Maheshwar Reddy: రుణమాఫీపై బహిరంగ చర్చకు సీఎం రేవంత్ సిద్ధమా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్

by Shiva |   ( Updated:2024-10-07 11:38:08.0  )
Alleti Maheshwar Reddy: రుణమాఫీపై బహిరంగ చర్చకు సీఎం రేవంత్ సిద్ధమా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 22.22 లక్షల మంది అన్నదాతలకు రూ.17.86 కోట్లు రుణమాఫీ చేసిందని ఇటీవలే ప్రధాన నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)కి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) లేఖ రాశారు. అయితే, తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. రైతులు రుణమాఫీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని ప్రధాని ఈ నెల 5న మహారాష్ట్రలో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో కామెంట్ చేశారు. కాగా, ఆయన వ్యాఖ్యలకు బదులుగా సీఎం రేవంత్ (CM Revanth), ప్రధానికి రాసిన లేఖను ‘X’ (ట్విట్టర్) వేదికగా రిలీజ్ చేశారు. ఆ లేఖలో ‘మీరు చేసిన వాఖ్యలు విని ఆశ్చర్యపోయా.. రుణమాఫీ కోసం బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు కేటాయించాం. అవసరమైతే రూ.31 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు రెడీగా ఉన్నామని ప్రస్తావించారు.

అయితే, ఆ లేఖపై ఇవాళ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Eleti Maheshwar Reddy) కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)కి రాసిన లేఖలో సీఎం రేవంత్ ‌రెడ్డి (CM Revanth Reddy) అన్ని అవాస్తవాలే ప్రస్తావించారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రుణ మాఫీ చేశామంటూ సీఎం అబద్ధపు లేఖ రాశారని ఆరోపించారు. మహారాష్ట్ర (Maharastra) ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రధానికి సీఎం లేఖ రాశారని ఆరోపించారు. రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని.. బహిరంగ చర్చకు సిద్ధమా అని ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Next Story