- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP Chamala : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra)లోని చంద్రపూర్ లోక్ సభ నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) వాహనాన్ని పోలీసులు తనిఖీ(check) చేశారు. సోమవారం ఉదయం చంద్రపూర్ నుండి వాణి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళుతున్న క్రమంలో మార్గమధ్యలో చెక్ పోస్ట్ వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఎన్నికల సమయంలో సాధారణంగా జరిగే తనిఖీల్లో భాగంగానే చామల వాహనాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కూటమి విజయాన్ని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ప్రచార పర్వంలో విమర్శలు ఎక్కుపెట్టారు. అటు బీజేపీ సైతం కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంగా మారిందని, ఆ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ నుంచి మహారాష్ట్ర ఎన్నికలకు నిధులు తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు్ల్లో తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.