Eatala Rajender: తాడు బొంగరం లేనోల్లే ఎదుగుతున్నారు.. మీరెలా ఉండాలి? బీఎస్ఎన్ఎల్ పై ఈటల

by Prasad Jukanti |   ( Updated:2025-02-27 11:48:23.0  )
Eatala Rajender: తాడు బొంగరం లేనోల్లే ఎదుగుతున్నారు.. మీరెలా ఉండాలి? బీఎస్ఎన్ఎల్ పై ఈటల
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ జరగాలని దీనికి హైదరాబాద్ పెద్దన్న పాత్ర పోషించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. ఇవాళ హైదరాబాద్ (Hyderabad) లో జరిగిన టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ బీఎస్ఎన్ఎల్ (BSNL) పునరుద్ధరణకు మా ఎంపీలు అందరం మద్దతుగా ఉంటామన్నారు. బీఎస్ఎన్ఎల్ గొప్ప సంస్థగా ఎదగడానికి కావాల్సిన ప్రణాళికలను రూపొందించాలని టెలికాం విభాగంలో మేమే సుప్రీం అనే భావనకు బీఎస్ఎన్ఎల్ రావాలన్నారు. తాడు బొంగరం లేని సంస్థలు ఎదుగుతున్నప్పుడు, ఇన్ని ఆస్తులు ఉండి, ఇంతమంది మాన్ పవర్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఎదగడం లేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు బాగుపడాలనేది ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన అని చెప్పారు. మనం ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్నామని గవర్నమెంట్ పాలసీలు ఎలా ఉన్నా మీ ఇన్నోవేషన్, కమిట్మెంట్, ప్రయత్నం ఉండాలని అది ఉంటే మీకు ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. లాభనష్టాల కోసం కాకుండా సర్వీస్ ఓరియెంటేషన్ తో పనిచేసే సంస్థ బీఎస్ఎన్ఎల్ అన్నారు.

Next Story

Most Viewed