- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డ్రైవర్లు, కండక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లు.. సజ్జనార్ ఆసక్తికర పోస్ట్
by Ramesh N |

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాజేంద్రనగర్ బస్ డిపోకు చెందిన రాగమల్ల అనుప రాణి ఫ్రెండ్లీ కండక్టర్‌గా గుర్తింపు ఉంది. ఇరవై నాలుగేళ్ల నుంచి ప్రయాణికులను ఏమాత్రం విసిగించకుండా నవ్వుతూ.. నవ్విస్తూ.. వృత్తిపట్ల అమితమైన ప్రేమను చూపించే అనూప రాణిని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఫ్రెండ్లీ కండక్టర్ అనూపరాణి స్పూర్తినిచ్చే జీవితకథ ఇది తెలిపారు.
నవ్వుతూ.. నవ్విస్తూ.. వృత్తిపట్ల అమితమైన ప్రేమను ఆమె చూపిస్తుండటం అభినందనీయమన్నారు. టీజీఎస్ ఆర్టీసీకి డ్రైవర్లు, కండక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లు అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వర్తించే ఇలాంటి సిబ్బంది పనితనం వల్లే.. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు సంస్థ చేర్చుతోందని హర్షం వ్యక్తంచేశారు.
Next Story