- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana Budget: పసలేని, దిశలేని, దండగమారి బడ్జెట్..! కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు, గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల, ఎగవేతల బడ్జెట్..! అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాగ్దానాలను గాలికొదిలిన వంచనల బడ్జెట్ అని, డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన దోకేబాజ్ బడ్జెట్ అని, అందులో విధానం లేదు, విషయం లేదు, విజన్ లేదని, పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్ అని ఆరోపించారు. అలాగే రైతులకు కత్తిరింపులు, అన్నదాతలకు సున్నం, ఆడబిడ్డలకు అన్యాయం, మహాలక్ష్ములకు మహామోసం, అవ్వాతాతలకు, దివ్యాంగులకు, నిరుపేదలకు, నిస్సహాయులకు మొండిచేయి చూపించారని అని పేర్కొన్నారు.
అంతేగాక పెన్షన్ల పెంపు మాటెత్తలేదని, దళితులకు దగా, గిరిజనులకు మోసం, అంబేద్కర్ అభయహస్తం ఊసులేదని, శూన్యహస్తమే మిగిలిందని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు భరోసాలేదని, వృత్తి కులాలపై కత్తికట్టారని, మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ నీటి మూటలైనయ్ అని తెలిపారు. అలాగే నిరుద్యోగుల ఆశలపై నీళ్లు, 4 వేల భృతి జాడా పత్తా లేదని, విద్యార్థులపై కూడా వివక్షే అంటూ.. 5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేదని, హైదరాబాద్ అభివృధిపై శ్రద్ధలేదని, మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవ్ అని చెప్పారు. ఇక నేతన్నకు చేయూత లేదని, ఆటో అన్నలను అండదండ లేదని, ఆత్మహత్యపాలైన కుటుంబాలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమే లేదని చెబుతూ.. మొత్తంగా పసలేని, దిశలేని, దండగమారి బడ్జెట్..! అని కేటీఆర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.