- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sumanth Reddy: ప్రియుడి కోసం భర్త మర్డర్ కు భార్య స్కెచ్!.. వరంగల్ యువ డాక్టర్ పై హత్య యత్నం కేసులో బిగ్ ట్విస్ట్

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టించిన వరగంల్ (Warangal) యువ డాక్టర్ పై హత్య కేసులో (Murder Attempt) ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. యువ డాక్టర్ సుమంత్ రెడ్డిపై (Dr.Sumanth Reddy) దాడి ప్లాన్ అతడి భార్య పనే అని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రియుడితో కలిసి కట్టుకున్నోడిని మర్డర్ చేసేందుకు అతడి భార్య ప్లాన్ చేసిందని ఈ దాడిలో ఓ ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ హస్తం కూడా ఉందనే చర్చ తీవ్ర కలకలం రేపుతున్నది. గత గురువారం రాత్రి వరంగల్ జిల్లాలోని ఉర్సుగుట్ట-భట్టుపల్లి మధ్యన కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ గాదె సుమంత్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. రక్తం మడుగులో కొన ఊపిరితో ఉన్న సుమంత్ రెడ్డిని స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. మిస్టరీగా మారిన ఈ ఘటనలో ఈ దాడికి సూత్రధారి బాధితుడి భార్య ప్లోరా మరియ (Plora Maria) అని పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన మరియ, ఆమె ప్రియుడితో పాటు ప్రియుడి స్నేహితుడైన ఏఆర్ కానిస్టేబుల్ ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
జిమ్ ట్రైనర్ తో వివాహేతర సంబంధం:
డాక్టర్ సుమంత్ రెడ్డి వైద్య విద్య పూర్తి చేశాక సంగారెడ్డి (Sangareddy) జిల్లా కేంద్రంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ క్రమంలో ప్లోరా మరియతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అక్కడ మరియ ఓ జిమ్ కు వెళ్లేది. ఈ క్రమంలో జిమ్ ట్రైనర్ శామ్యూల్ తో మరియకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న సుమంత్ పద్దతి మార్చుకోవాలని తన భార్యను మందరించాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోతేనే తన భార్యలో మార్పు వస్తుందేమో అని గ్రహించి సుమంత్ మూడేళ్ల క్రితం కాజిపేటకు మకాం మార్చాడు. ఒక్కడే ఓ క్లినిక్ ప్రారంభిచడంతో పాటు తన భార్యకు రెసిడెన్షియల్ స్కూల్ లో టీచర్ గా అవకాశం రావడంతో స్కూల్ కు దగ్గర్లో రూమ్ తీసుకున్నాడు.
అయితే భర్త మందలింపుతో బుద్ధి తెచ్చుకోని ప్లోరా మరియ.. సంగారెడ్డి నుంచి వచ్చే తన ప్రియుడు శామ్యుల్ ను తరచూ కలిసేది. అయితే తన ప్రియుడికి తనకు మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన మరియ.. సుమంత్ అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేసింది. తన ప్రియుడితో కలిసి ఈ మర్డర్ కు ప్లాన్ చేసింది. మర్డర్ కేసులో దొరికిపోకుండా ఉండాలని శామ్యుల్ తన స్నేహితుడైన ఓ ఏఆర్ కానిస్టేబుల్ సహకారం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 20న దారి కాపుకాచి డాక్టర్ పై దాడి చేశారు. దాన్ని ఓ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అతడు చనిపోయాడనుకుని అక్కడి నుంచి నిందితులు వెళ్లిపోయారు. కానీ సుమంత్ కొనఊపిరితో ఉండగా స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. దాడి తర్వాత కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు భర్తను చంపేందుకు భార్య రాసిన రక్త చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చారు. త్వరలోనే ఈ ఘటనపై పోలీసులు పూర్తి అధికారిక వివరాలు వెల్లడించాల్సి ఉంది.