ప్రత్యేక NRI మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు కాంగ్రెస్ కృషి.. : డాక్టర్ ఆరతి కృష్ణన్

by Disha Web Desk 9 |
ప్రత్యేక NRI మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు కాంగ్రెస్ కృషి.. : డాక్టర్ ఆరతి కృష్ణన్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ పనిచేసిందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ ఆరతి కృష్ణన్ అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలుచేస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్నీ తెచ్చిందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, యువత కోసం యువ న్యాయ్ ద్వారా ఉపాధి కల్పించే హామీ ఇచ్చిందని వెల్లడించారు. nri సమస్యలపై Nri ప్రత్యేక మినిస్ట్రీ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. బీజేపీ ప్రత్యేక nri మినిస్ట్రీని ఏర్పాటు చేయలేదని విమర్శించారు. చాలా సమస్యలున్నాయి రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ల కోసం పోరాటం జరుగుతోందని తెలిపారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్రల ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకున్నారన్నారు. గత కాంగ్రెస్ హయాంలో కూడా చాలా చట్టాలను, సంక్షేమ పథకాలను చేపట్టిందని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో nri లుకాంగ్రెస్‌కు మద్దతివ్వాలని వచ్చామన్నారు. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వస్తున్నారని, వారు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనాలని అభ్యర్థించారు. అలంపూర్ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నామని చాలా మంచి స్పందన వచ్చిందని తెలంగాణాలో కాంగ్రెస్‌కు 10,12 వరకు సీట్లు తప్పక వస్తాయని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ ఆరతి కృష్ణన్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed