దేశాన్ని విచ్ఛిన్నం చేయొద్దు.. జయప్రకాష్ నారాయణ్ కీలక పిలుపు

by Disha Web Desk 4 |
దేశాన్ని విచ్ఛిన్నం చేయొద్దు.. జయప్రకాష్ నారాయణ్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ప్రజాస్వామ్యం లేదని అంటున్నారని అది తప్పు అని లోక్ సత్తా పార్టీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్ అన్నారు. గురువారం కిషన్ రెడ్డి ప్రగతి నివేదిక కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో లోపాలు ఉన్నాయి కావచ్చు కానీ కానీ అత్యంత బలమైన ప్రజాస్వామ్యం మనదే అన్నారు. అమెరికా ప్రజాస్వామ్యంలోనూ లోపాలు ఉన్నాయని గుర్తు చేశారు. కిషన్ రెడ్డికి మిత్రుడిగా మాత్రమే కాదు.. ఒక ఓటరుగా ఈ కార్యక్రమానికి వచ్చానన్నారు. ప్రజలు.. తమ భవిష్యత్ కోసం తాము ఓటు వేయాలని సూచించారు. ఇది కులాల, మతాల పోరాటం కాదని.. దేశ అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలు స్పష్టం చేశారు. వ్యక్తులు శాశ్వతం కాదు.. వ్యవస్థ శాశ్వతం అన్నారు. రాజకీయాలు ఎన్ని అయినా ఉండవచ్చు.. కానీ దేశం ఒక్కటే అని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రాల హక్కుల కోసం పోరాడాలి.. కానీ అందుకోసం దేశాన్ని విచ్చిన్నం చేయవద్దని పిలుపునిచ్చారు.

Next Story