- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
HYD: రేసు ముగిసినా మాకు ఈ కష్టాలు తప్పవా? (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున జరిగిన అంతర్జాతీయ ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ సక్సెస్ ఫుల్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ రేసింగ్ కారణంగా దాదాపు 10 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో వాహనదారులు మండిపడ్డారు. 'మీ ఎంజాయ్ మెంట్ కోసం మేమెందుకు కష్టపడాలి' అంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అయితే, ఫిబ్రవరి 11న ఈరేసింగ్ పూర్తి అయినా.. రేసింగ్ కోసం ఏర్పాటు చేసిన జాలీలు, డివైడర్లను అధికారులు తొలగించకపోవడంపై ప్రయాణికులు ప్రభుత్వంపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేసింగ్ పూర్తి అయినా వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని సోషల్ మీడియాలో కంప్లైంట్స్ చేస్తున్నారు.
'రేసింగ్ కోసం యుద్ధ ప్రాతిపదిగిన ఏర్పాటు చేసిన జాలీలు డివైడర్లను ఇంకా తొలగించలేదని.. దీంతో, ఎన్టీఆర్ మార్గం ఇందిరాగాంధీ విగ్రహం వద్ద వరకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. అధికారులు వీటిని తీయడం మర్చిపోయినట్లుగా ఉన్నారు' అంటూ విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా, డివైడర్ల కారణంగా పాద చారులు ఎక్కడ నడవాలో అర్థం కాక గందరగోళంలో ఉండిపోతున్నారని.. దీనికి తోడు ఇదే రోడ్లపై ఐస్‌క్రీం తదితర బండ్లు పెట్టి విక్రయాలు జరుపుతున్నారని వీడియోలు షేర్ చేస్తున్నారు. వీటిపై జీహెచ్ఎంసీ అధికారులు స్వయంగా పర్యవేక్షించి ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఈ రోడ్డులో పాద చారులు ఎక్కడ నడవాలో అర్థం కాక గందరగోళంలో ఉండిపోయారు. దీనికి తోడు ఇదే రోడ్లో పై బండ్లు పెట్టి విక్రయాలు జరుపుతున్నారు. ఈ రోడ్డు పరిస్థితిని @Director_EVDM . @HMDA_Gov @hydcitypolice అధికారులు స్వయంగా పర్యవేక్షించి ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రార్థన. @HYDTP https://t.co/I6dguToi18
— RameshVaitla (@RameshVaitla) February 20, 2023