- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dil Raju: రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీ తరఫున రేపు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలువబోతున్నట్లుగా ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజ్ తెలిపారు. ఇవాళ ఆయన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ (Sritej)ను అల్లు అరవింద్ (Allu Aravind)తో కలిసి పరామర్శించారు. అనంతరం రూ.2 కోట్ల పరిహారానికి సంబంధించి చెక్కులను రేవతి (Revathi) భర్తకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీతేజ్ (Sritej) గత మూడు రోజులుగా వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నాడని తెలిపారు.
అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకు TFDC తరఫున హీరోలు (Hero's), డైరెక్టర్లు (Directors), ప్రొడ్యూసర్లు (Producers), అల్లు అర్జున్ (Allu Arjun)తో సహా అందరూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలవబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. భేటీకి సంబంధించి ఇప్పటికే సీఎంవో (CMO) నుంచి కూడా అనుమతి లభించిందని తెలిపారు. ఈ సమావేశంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పాటు ఇతర అంశాలపై సీఎంతో టాలీవుడ్ పెద్దలు చర్చించనున్నారని దిల్ రాజు స్పష్టం చేశారు.