- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రితో నిత్యం టచ్ లో దిల్ రాజు.. ఈసారి పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?
దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో సినిమా సెలబ్రెటీల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాలిటిక్స్ లో తమ సత్తా చాటుతుండగా తాజాగా టాలీవుడ్ కు చెందిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వ్యవహారం మరోసారి చర్చనీయాశం అవుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దిల్ రాజ్ రాజకీయాల్లోకి వస్తారని విపరీతంగా ప్రచారం జరిగింది. ఆయన పోటీ చేయబోయే స్థానం ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఆయన అటువంటి నిర్ణయం ఏమీ తీసుకోనప్పటికీ తాజాగా ఆయన తీరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో దిల్ రాజు తరచూ టచ్ లో ఉంటున్నారనే చర్చ గుప్పుమంటోంది. తాజాగా పద్మవిభూషణ్ అవార్డు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రి కోమటిరెడ్డి చిరంజీవి నివాసానికి వెళ్లగా అక్కడ దిల్ రాజు ప్రత్యక్షం కావడంతో తరచూ మంత్రితో దిల్ రాజ్ సత్సంబంధాలు కొనిసాగించడం వెనుక సినిమా ఇండస్ట్రీ కోసమా లేక రాజకీయ ఎంట్రీ కోసమా అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.
మంత్రితో నిత్యం టచ్ లో:
సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంలో టాలీవుడ్ నుంచి తనకు ఎవరూ విష్ చేయలేదని ఒక్క దిల్ రాజు మాత్రమే శుభాకాంక్షలు చెప్పారని స్వయంగా కోమటిరెడ్డి చెప్పారు. ఆ తర్వాత సినిమా రంగానికి చెందిన పెద్దలు మంత్రిని కలిశారు. మంత్రితో ఈ మీటింగ్ జరగడంలో దిల్ రాజ్ కీలకంగా వ్యవహారించారనే టాక్ వినిపించింది. ఈ క్రమంలో తాజాగా మంత్రి చిరును కలిసిన సందర్భంలోనూ దిల్ రాజు ఉన్నారు. వరుస పరిణామాల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో ఓ చర్చ విపరీతంగా జరుగుతోంది. దిల్ రాజు ఈసారి రాజకీయ రంగ ప్రవేశం ఖాయం అని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పొలిటికల్ ఎంట్రీ కోసం వ్యూహాత్మక అడుగులు:
ప్రస్తుతం చలన చిత్ర వాణిజ్య మండలి చైర్మన్ గా కొనసాగుతున్న దిల్ రాజ్ కు కాంగ్రెస్, బీఆర్ఎస్ తో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే గతంలో బీఆర్ఎస్ నాయకులతో సంబంధాలు కలిగి ఉన్న దిల్ రాజ్ ఆతర్వాత వారికి దూరంగా ఉంటు ప్రస్తుతం కాంగ్రెస్ నేతలకు చేరువ అవుతున్నారనే చర్చ సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తితో ఉన్న ఆయన ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా మంత్రితో టచ్ లో ఉంటున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన దిల్ రాజ్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పనున్నది.