ఎన్నికల వేళ స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు

by Satheesh |   ( Updated:2024-04-10 16:10:01.0  )
ఎన్నికల వేళ స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమంది. లింగాలఘనపురం మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సింగాపురం ఇందిరా వర్గీయులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కార్యకర్తల చేరిక కార్యక్రమంలోఈ ఘర్షణ తలెత్తింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న నాయకుల ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చింపి ఆందోళన చేశారు. కడియం శ్రీహరి, కావ్యకు వ్యతిరేకంగా ఇందిరా అనుచరుల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కడియం శ్రీహరి క్యాడర్‌ను పార్టీలో చేర్చుకోవద్దంటూ డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తడంతో కడియం శ్రీహరి, వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని కడియం కావ్య కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.

Advertisement

Next Story