‘నారి నారి నడుమ మురారి’ ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్.. పోస్టర్‌తో అంచనాలను పెంచేసిన మేకర్స్

by Hamsa |
‘నారి నారి నడుమ మురారి’ ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్.. పోస్టర్‌తో అంచనాలను పెంచేసిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) కొద్ది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక ఇటీవల ‘మనమే’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari). రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో సాక్షి వైద్య, సంయుక్తా మీనన్(Samyukta Menon) హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనికి భాను బోగ వరపు కథ అందించగా.. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర , రామబ్రహ్మం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

శర్వానంద్ నటిస్తున్న 37వ చిత్రమిది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచింది. అయితే ఈ చిత్రానికి బాలకృష్ణ నటించిన సినిమా టైటిల్ పెట్టడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రీరామ నవమి పండుగ సందర్భంగా మూవీ మేకర్స్ ‘నారి నారి నడుమ మురారి’ సినిమా అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘‘దర్శనమే’’ సాంగ్ ప్రోమో ఏప్రిల్ 7వ తేదీన రాబోతుంది. ఇక పూర్తి పాట మాత్రం ఏప్రిల్ 9వ తేదీన రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేసి అంచనాలను పెంచారు. ఇందులో సంయుక్తా మీనన్ చేతిలో దీపం పట్టుకొని నాట్యమయూరిలా కనిపిస్తుండగా.. శర్వానంద్ మోకాళ్ళ మీద కూర్చొని ఆమె కాళ్లు పట్టుకుని గజ్జెలు కడుతున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిలో ఆసక్తి రెట్టింపు చేస్తుంది.

Next Story

Most Viewed